If tested COVID-19 positive, consider England tour over: BCCI's strict directives for Team India
#Teamindia
#Bcci
#WtcFinal
#ViratKohli
#Pujara
#IndvsNz
#Indvseng
జూన్ 18-22 మధ్య న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, ఆపై ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఎంపికయిన టీమిండియా ఆటగాళ్లకు భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ పర్యటనలకు బయలుదేరే ముందు.. ముంబైలో జరిగే కరోనా పరీక్షల్లో పాజిటివ్ తేలిన ఆటగాడు భారత జట్టుకు దూరమవుతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు కేవలం ఆటగాళ్లకు మాత్రం కాదు వారి కుటుంబ సభ్యులు మరియు సహాయక సిబ్బంది కూడా వర్తించనున్నాయి. ముంబైకి చేరుకునే వరకు ఐసొలేషన్‌లో ఉండి తమను తాము వైరస్ బారినుంచి కాపాడుకోవాలని భారత జట్టు ఫిజియో యోగేశ్ పర్మార్ ఆటగాళ్లకు సూచించారు